30 July, 2026 | 8:09 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

బాల్యవివాహాల నిర్మూలనపై విస్తృత ప్రచారం చేయండి

14-11-2025 11:21 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపు నిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్)సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనకై వందరోజుల ప్రచార ఉద్యమ గోడ పత్రికను ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు లేని తెలంగాణ లక్ష్యంలో భాగంగా భద్రాద్రి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తెలంగాణలో కీర్తికెక్కెలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. స్వయం సహాయక బృందాల వారు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు మహిళలు ఈ బాల్య వివాహ నిర్మూలన ప్రచారోద్యమంలో కీలక భూమిక పోషించాలని మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని ఆయన పిలుపునిచ్చారు.

ఆడపిల్లల సర్వతో ముఖాభివృద్ధికి బాల్య వివాహాలు అడ్డుగోడలు కాకూడదని, ఎవరైనా బాల్యవివాహాలను చేయడానికి ప్రయత్నించిన సహకరించిన చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని హెచ్చరించారు. బాలల యొక్క సమస్యలను 24 గంటలు పని చేసే చైల్డ్ లైన్ 1098 కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. జిల్లా బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలందరూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం  లో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్  టీం సభ్యులు మాన్సింగ్, జ్యోతి, మోహన్ ,మౌనిక తదితరులు పాల్గొన్నారు.