14-11-2025 11:21:06 PM
రెండు వాహనాలు, 4 ఫోన్లు సీజ్
భీమదేవరపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ శివారులో పెట్రోలింగ్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు అను మానాస్పదంగా పోలీసులను చూసి పారిపోతుండగావారి పట్టుకొని తనికి చేయగా వారి వద్ద 750 గ్రాముల ఎండు గంజాయి పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వంగర ఎస్త్స్ర జి దివ్య తెలిపారు.
వారిని విచారించగా అట్టి గంజాయిని భద్రాచలం వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసినామని తెలిపారు.అరెస్టు చేసిన వారు ఇల్లందుల నిఖిల్, జూపాక గ్రామం కలిపాక శ్రీనివాస్, హుజూరాబాద్ టౌన్ పచిమట్ల సాయినాథ్, హుజురాబాద్ టౌన్ ,బండ అజయ్, పెద్ద పాపయ్య పల్లి గ్రామం వీరు అందరూ హుజురాబాద్ మండలానికి చెందినవారని వెల్లడించారు. వెంటనే పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి 750 గ్రాముల ఎండు గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైక్ లను సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరిచినట్టు తెలిపారు.