15-11-2025 12:00:00 AM
ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్
సిద్దిపేట క్రైం, నవంబర్ 14 : సిద్దిపేట పట్టణంలోని సుభాష్ రోడ్డు నుంచి చేపల మార్కెట్ వరకు రహదారిపై ఆక్రమణలను సోమవారం నుంచి తొలగించనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తెలిపారు. ఈ విషయమై ఆయన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ను కలిసి, అవసరమైన చర్యలపై చర్చించారు. మున్సిపల్, ట్రాఫిక్ శాఖలు కలిసి సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశానుసారం రోడ్డుపై ఉన్న శాశ్వత, తాత్కాలిక ఆక్రమణలను తొలగించే కార్యాచరణను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సోమవారం లోగా ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని వ్యాపారులకు ఆయన సూచించారు. వాహనదారులు, పాదచారులకు ఇబ్బంది కలగ కుండా చూడాలని కోరారు. ఫుట్పాత్లను వ్యాపార సామగ్రితో ఆక్రమించవద్దని స్ప ష్టం చేశారు. త్వరలో వ్యాపారులతో ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఏసీపీ వెంట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.