డ్యూటీలో ఉన్న కండక్టర్ గుండెపోటుతో హఠాన్మరణం
17-10-2025 08:22 AM
దుమ్మగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపోకు చెందిన డి సైదులు (826327) అనే కండక్టర్ 8.00 గంటల భద్రాచలం- వెంకటాపురం వెళ్లే బస్సులో డ్యూటీ చేస్తుండగా, దుమ్ముగూడెం సమీపంలో ఛాతిలోనొప్పి రావడంతో డ్రైవర్ వెంటనే దగ్గరలోని దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం 108 లో భద్రాచలం హాస్పటల్ తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్ల పరీక్షించి మార్గమధ్యలోనే మరణించినట్లు నిర్ధారించారు.






