17-10-2025 08:27:10 AM
జిల్లా ఎస్పీ నరసింహ
అర్వపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి పలు కేసుల రికార్డులను తనిఖీ చేసి,సిబ్బంది పనితీరును ఎస్ఐ సైదులును అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేస్తూ మాట్లాడారు.కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు అలసత్వం వహించకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
నేరాలు,దొంగతనాల నివారణకు గ్రామాల్లోని ప్రధాన కోడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.మండలంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని,ఇసుక ట్రాక్టర్లను అతివేగంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.సైబర్ నేరాలపై ప్రజల్లో ప్రచారం పెంచుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా ప్రచారం నిర్వహించాలని,గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు.ఎన్నికల నేపథ్యంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.కార్యక్రమంలో ఎస్సై ఈట సైదులు,ఏఎస్ఐ రామకోటి,హెడ్ కానిస్టేబుల్ సుధీర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.