17-10-2025 01:36:49 AM
బీసీ కోటా అంశం
రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
-హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు స్వీకరించలేం
-కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చునని పేర్కొన్న సుప్రీం
-మెరిట్స్ ప్రకారం విచారించాలని హైకోర్టుకు సూచన
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం హైకో ర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం గురువారం స్పష్టంచేసిం ది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని.. మెరిట్స్ ప్రకారం విచారించాలని హైకో ర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. స్థాని క ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీఓ 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలుచేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఈనెల 9న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం 13వ తేదీన పిటిషన్ దాఖలుచేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ అంశంపై విచారించాలని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు మెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరి నట్లుగానే రిజిస్ట్రీ ఈ కేసును గురువారం విచారణ జాబితాలో చేర్చింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై విచారణకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ జరిపింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్ర పతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వే షన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాం. గవర్నర్ బిల్లు పెండింగ్‌లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిం ది. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్‌లో పెట్టారు. బిల్లును ఛాలెంజ్ చే యకుండా, బిల్లు ద్వారా విడుదల చేసిన జీ వోను సవాల్ చేశారు. రిజర్వేషన్లను పెం చుకునే సౌలభ్యం ఇందిరా సహాని కేసులో తొ మ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టు వి ధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభు త్వం అమలుచేసింది. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వే షన్లు నిర్ణయించాం. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెం చాం. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వ హించాం. సమగ్రంగా, సాంకేతికంగా సర్వే జరిపాం. అన్నివర్గాలతో విస్తృ త సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపైన స్టే ఎలా విధిస్తారు?. హైకోర్టు మ ధ్యంతర తీ ర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు. ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపు ల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పింది’ అని అన్నా రు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఎస్టీ ప్రాం తాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా? అని ప్రశ్నించింది.
ప్రతివాది మాధవరెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనే క సందర్భాల్లో స్పష్టంచేసిందన్నారు. షె డ్యూల్ ఏరియా, గిరిజన ప్రాంతాలలో మా త్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెం చుకునేందుకు అనుమతి ఉందని చెప్పారు. జనరల్ ఏరియా లలో రిజర్వేషన్లను 50 శా తానికి మించి పెంచడానికి వీలులేదు అ న్నారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవని పేర్కొన్నారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించిందని తెలిపారు. మ హారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందన్నారు. ట్రిపుల్ టెస్ట్‌లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదని చెప్పారు.