6 March, 2026 | 7:55 AM

ప్రవర గవర్నెన్స్, కంప్లయన్స్

06-03-2026 12:00 AM

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సదస్సు 

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రోగులకు సురక్షితమైన వైద్యం అందించడంలో చట్టపరమైన నిబంధనలు, పారదర్శక వ్యవస్థలు ఎంత ముఖ్య మో తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్ ’ప్రవర 2026’  కేర్ గవర్నెన్స్ అండ్ కంప్లయన్స్ సమ్మిట్ 2.0 (సీజీజీఎస్) పేరుతో రెండు రోజుల సదస్సును ప్రారంభించింది.

ఈ కార్యక్రమం బంజారాహిల్స్లోని హోటల్ హయత్ ప్లేస్లో జరుగుతోంది. సదస్సులో హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్స్, న్యాయ నిపుణులు, కంప్లయన్స్ అధికారులు, క్వాలిటీ బృందాలు పాల్గొని ఆసుపత్రులలో గవర్నెన్స్ వ్యవస్థలను మరింత బలపరచడం గురించి చర్చించారు.

డాక్టర్ జయశ్రీ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, హైదరాబాద్; డాక్టర్ అమితా రాణి, సభ్యురాలు లోక్ అదాలత్ అండ్ సభ్యురాలు స్టాట్యూటరీ కమిటీ, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (రంగారెడ్డి); క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి; కేర్ హాస్పి టల్స్ సీఈవో డాక్టర్ పవన్ కుమార్ ; క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చీఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఎస్.వి. కిరణ్; డాక్టర్ నిఖిల్ మాథూర్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్; శలభ్ డాంగ్, చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అధికారి; డాక్టర్ అమిత్ సింగ్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి, కేర్ హాస్పిటల్స్; రాజీవ్ చౌరే, వైస్ ప్రెసిడెంట్  క్వాలిటీ, ఆపరేషన్స్ అండ్ ఈఎస్జీ; డాక్టర్ రవీందర్ నమిలికొండ, ప్రధాన పర్యావరణ శాస్త్రవేత్త, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి; వినోద్ రా మన్, ముఖ్య సాంకేతిక అధికారి క్యూసీఐఎల్; వైభవ్ జోషి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్  ఫైనాన్స్; డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్, వైస్ ప్రెసిడెంట్  నర్సింగ్; శివ కుమార్, వైస్ ప్రెసిడెంట్  ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ హాజర య్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వైద్య రంగంలో కంప్లయన్స్ అంటే కేవలం పత్రాల నిర్వహణ మాత్రమే కాదు. అది ఆసుపత్రి సంస్కృతిలో భాగం కావాలి. మంచి గవర్నెన్స్ ఉంటే రోగు ల భద్రత పెరుగుతుంది, ప్రజల విశ్వాసం కూడా బలపడుతుందన్నారు.