28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

11-06-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10(విజయ క్రాంతి):ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సు ల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తెలిపారు. మంగళవారం  కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి రెవె న్యూ సదస్సు సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.

రెవెన్యూ సద స్సులలో అందిన దరఖాస్తులను పరిశీలించి రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వతంగా సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దుర్గానగర్ లో కొనసాగుతున్న భూభారతి సదస్సును సంద ర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మధుకర్, ఉపతహసిల్దార్ సరిత, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.