calender_icon.png 12 February, 2026 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టుకతోనే గుండె లోపాలు

12-02-2026 03:04:16 AM

  1. ముందుగా గుర్తిస్తే చిన్నారుల గుండెలు సురక్షితం
  2. కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న కంజెనిటల్ హార్ట్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా, కేర్ హాస్పిటల్స్ నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి వెయ్యి మంది శిశువుల్లో సుమారు 8 మంది పిల్లలు జన్మతోనే గుండె సమస్యలతో పుడుతున్నారు. భారత్‌లో ఏటా సుమారు 1.8 నుంచి 2 లక్షల మంది చిన్నారులు ఈ గుం డె సమస్యతో ప్రభావితమవుతున్నారు.

ర్భధారణ సమయంలో గుండె పూర్తిగా అభి వృద్ధి చెందకపోవడం వల్ల ఈ లోపాలు ఏర్పడతాయి. గుండెలోని గదులు, వాల్వు లు లేదా రక్తనాళాల్లో లోపాలు ఉండడం వల్ల రక్తప్రవాహం సరిగా జరగదు. సమస్య తీవ్రంగా ఉంటే శరీరానికి సరైన ఆక్సిజన్ అందకపోవడం, గుండె బలహీనపడటం, పిల్లల పెరుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ ప్రకాశ్‌రావు పాటిల్, మాట్లాడుతూ “మన గుండె రోజుకు దాదా పు లక్షసార్లు కొట్టుకుంటూ శరీరమంతా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపిస్తుంది. గుండెలో లోపం ఉంటే ఈ ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించడం పెద్ద సవాల్‌గా మారుతోంది.

సాధారణంగా కనిపించే గుండె లోపాల్లో ‘గుండెలో రంధ్రాలు’గా పిలిచే ఏఎస్‌డీ, వీఎస్‌డీ ముఖ్యమైనవి. గర్భిణులకు 18 వారాల మధ్య చేసే ఫీటల్ ఎకో పరీక్ష ద్వారా గర్భంలోనే శిశువు గుండె లోపాలను గుర్తించవచ్చు’ అని చెప్పారు. పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీ క్లినికల్ డైరెక్టర్, విభాగాధిపతి డాక్టర్ తపన్ కుమార్ డాష్ మాట్లాడుతూ.. “తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతోంది. కానీ సమస్యను తొం దరగా గుర్తించి సరైన వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందితే, పుట్టుకతో గుండె లోపం ఉన్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదిగి పెద్దవారవుతారు” అని తెలిపారు.