1 August, 2026 | 5:51 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

సుపరిపాలన కోసమే జీహెచ్‌ఎంసీ విభజన

12-02-2026 03:02 AM
  1. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారం
  2. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్

హైదరాబాద్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి): మూడు కార్పొరేషన్లు, 12 జోన్లు, 60 సర్కిలు, 300 డివిజన్లను అతి తక్కువ స్వల్ప కాలంలో  త్రికరణ శుద్ధి, ధృఢ సంకల్ప బలంతో విభజన ప్రక్రియను, సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన డైనమిక్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ అధ్యక్షుడు ఊదారి గోపాల్ తెలిపారు.

బుధ వారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయంలోకమిషనర్ కర్ణన్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధుల బృందం కలిసి ఆయన్ని సత్కరిం చారు. అలాగే మల్కాజిగిరి, సైబరాబాద్, జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్లతో కూడిన మ్యాప్ ల ఫొటో ప్రతిమను కమిషనర్‌కు బహూకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉదారి గోపాల్ మాట్లాడుతూ నూతనంగా మూడు కార్పొరేషన్లు

ఏర్పాటు కావ డం వల్ల ప్రజలకు సుపరిపాలన తోపాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. కొత్తగా ఏర్పాటైన ఈ మూడు కార్పొ రేషన్లకు ముగ్గురు కమిషనర్లు నియమిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం, ఎంతో శుభసూచికమని గోపాల్ అన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ టి నర్సింగ్ రావు, చార్మినార్ అధ్యక్షులు బి కన్నా, రాజేందర్ నగర్ అధ్యక్షులు ఎం కృష్ణ, సీనియర్ నాయకులు కే అమరేశ్వర్, ఎంఏ జఫర్ తదితరులు పాల్గొన్నారు.