ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు
01-05-2026 10:50 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల కేంద్రములోని మాంట్ ఫోర్ట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రదర్ వినోద్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుక్రవారం అభినందించారు. వారు మాట్లాడుతూ... మొత్తం 27 మందికి 27మంది విద్యార్థులు 100శాతం పాస్ అయ్యారని. 20మందికి 500కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని,మండలం ఫస్ట్ 578 మార్కులు బానోతు లోహిత మా పాఠశాల విద్యార్థికి రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.అనంతరం కెక్ కట్ట్ చేసి విద్యార్థులకు తినిపించారు.






