20 March, 2026 | 3:15 AM

కాంగ్రెస్.. సెక్యులర్ పార్టీ!

20-03-2026 01:30 AM
  1. మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
  2. ధర్మపురి లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి

ధర్మపురి, మార్చి19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సం దర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి పట్టణంలోని ఎస్‌ఎచ్ గార్డెన్ లో తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కు మార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లీం పేదలకు తోఫా పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని 2050 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని మం త్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మం త్రి తెలిపారు. ఇందులో భాగంగా పేద ము స్లింల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

వచ్చే గోదావరి పుష్కరాలకు ధర్మపురికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ధర్మపురి బస్ డిపో మంజూరు కోరకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలు వరకు ధర్మపురి బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.

మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమ ప్రభుత్వమని, ముస్లీం సోదర సోదరిమణులకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.