ఎర్రుపాలెం శివాలయానికి శృంగేరి శారద పీఠాధిపతి
03-07-2026 11:43 AM
ఎర్రుపాలెం జులై 3 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం శివాలయాన్ని శుక్రవారం నాడు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీవిభూషితజగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామివారు వస్తున్నారని శివాలయం చైర్మన్ మగినం జయశ్రీ పేర్కొన్నారు. మహాసన్నిదానంవారి అనుగ్రహ ఆశీస్సులతో కరకమల సంజాతులు,తదభేద స్వరూపులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరభారతీసన్నిదానం వారు ఈ నెల 3-07-2026 శుక్రవారం మధ్యాహ్నం శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి సందర్శనం సందర్భంగా విచ్చేయచున్నారు. కావున భక్తులందరూ శృంగేరి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.






