20 March, 2026 | 3:16 AM

ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం

20-03-2026 01:28 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, మార్చి19(విజయక్రాంతి):శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి వెంటకార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మెన్ సత్తు మల్లేష్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.

ఈ సందర్బంగామంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూఈ ఉగాది సందర్భంగా రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుతున్న అన్నారు.ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని,

పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని అన్నారు.మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు.తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్‌ఎస్ లు సహకరించాలన్నారు. అనంతరం కరీంనగర్ నగరంలోని అలుగునురు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.