calender_icon.png 17 July, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

16-07-2025 12:38:17 AM

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 

కామారెడ్డి, జూలై 15 (విజయక్రాంతి), కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జి ల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సా మాజిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇందిరా మహిళ శక్తి సం బరాల్లో భాగంగా అక్షర లక్ష్మి కార్యక్రమం ద్వారా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు కనీస విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మహిళా సంఘాల్లో భాగము కానీ కొత్త మహిళలను చేర్పించి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని మహిళ సభ్యు లను కోరారు. ప్రతి సంఘ సభ్యురాలికి జీవిత బీమా తప్పనిసరిగా ఉండాలని సూచించ డంతోపాటు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మిం చుకునే మహిళలకు లక్ష రుణ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి మహిళలకు మహిళా సమైక్య ద్వారా పెట్రోల్ బంకులు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 

 రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్ యూనిఫాంలో కొట్టే బాధ్యతను ఐకెపి మహిళా సంఘాలకే అప్పగించడం ద్వారా కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థల కో సం మన యూనిఫాంలో పుట్టే పనులను కూడా మహిళా సం ఘాలకు అప్పగించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో స్త్రీ శిశు సంక్షేమానికి రూ.2,862 కోట్లు కేటాయించి మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. మ హిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో పలు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ మహిళ అభివృద్ధికి ఇందిరామాల శక్తి పథకం మహిళలకు ఒక వరం లాంటిదని తెలిపారు.

మహిళా సంఘాలు మంత్రి సీతక్కను గజమాలతో సన్మానించారు. మహిళా సంఘాలు తయారుచేసిన వాటిని తిలకించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సం క్షేమ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్, డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ సురేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సెర్ప్ సీఈవో నగేష్, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.