16-07-2025 12:37:25 AM
ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ సునీత
మెదక్, జూలై 15(విజయక్రాంతి): జిల్లాలో ఆయిల్ పామ్ పంట విస్తరణ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ సునీత అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉద్యానశాఖ నుండి పర్యవేక్షణ అధికారిగా నియమింపబడిన పి.సునీత జిల్లాను సందర్శించడం జరిగింది.
జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో ఉద్యాన అధికారులను, ఆఫీస్ సిబ్బంది, ఆయిల్ పామ్ కంపెనీల మేనేజర్లు, ఫీల్ సిబ్బందిని వివిధ పథకాల ను సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ పంట విస్తరణ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో నూతన జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్ సింగ్, వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, లివ్ పామ్ రిసోర్సెస్ కంపెనీ మేనేజర్ కృష్ణ, ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.