28 February, 2026 | 10:46 PM

కాంగ్రెస్, బీజేపీల నాటకం బైటపడింది

28-02-2026 12:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీ నాయకులు కలిసి ఒకే హెలికాప్టర్‌లో రావడం... జిల్లాకు దొంగ చాటున వచ్చి దొంగ చాటున వెళ్లారని మాజీ జోగు రామన్న ఆరోపించారు. ఇద్దరు కలిసి ఆదిలాబాద్ ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇండ్రస్ట్రియల్ పార్క్ అంటూ ప్రజలను మో సం చేస్తున్నారనీ, ఇంత వరకు సీసీఐ పున: ప్రారంభం చేయలేదన్నారు. నిన్నటి మంత్రి పర్యటన ఇద్దరు ఆడిన పచ్చి డ్రామా అన్నా రు. పారిశ్రామిక వాడ పేరుతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ డ్రామాలు అడుతున్నారన్నారు. ఈడీ సీజ్ చేసిన భూములు, జీఎస్ అర్ భూములు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు వాటిని అమ్మడానికి పాయల్ శంకర్ కుట్ర పన్నుతున్నారని తెలిపారు. బోరజ్ మండలంలో హత్తిఘాట్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ దందా చేస్తున్నారనీ ఆరోపించారు.

ధరణిలో పట్టాలు కాని భూములను భూ భారతిలో పాయల్ శంకర్ అక్రమంగా పట్టాలు చేయిస్తున్నారనీ ద్వజమెత్తారు. ఆ భూములను పాయల్ శంకర్ కుటుంబ సభ్యులు కోనుగోలు చేస్తున్నారనీ తెలిపారు. ఈడీ అటాచ్ లో భూముల కోనుగోలుపై బహిరంగ చర్చకు సిద్దమాఅని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పారిశ్రామిక వాడ లో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, పారిశ్రామిక వాడతో పాయల్ శంకర్ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు దక్కుతాయన్నారు.