30 August, 2026 | 6:18 PM

బోనకల్ కాంగ్రెస్ బీఎల్‌ఏల ఆత్మీయ సమావేశంలో దుద్దిళ్ల శ్రీను బాబు

30-08-2026 05:16 PM

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్న..

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మంథని,మధిర, ఆగస్టు 29(విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రం జానకీపురం గ్రామంలో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) ఆత్మీయ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ప్రత్యేకంగా పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సమావేశానికి హాజరైన శ్రీను బాబు, మండలంలోని బూత్ స్థాయి కార్యకర్తలు, బీఎల్‌ఏలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.

ప్రతి బూత్‌లో పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల స్థాయి కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.