ఇచ్చిన మాట తప్పని కాంగ్రెస్
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు
కామారెడ్డి అర్బన్ ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో జరిగిన బిసి డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా బిసి కుల గణాన చేపట్టి బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారన్నారు.
గిట్టని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని వాటిని ప్రజలు కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, గోనె శ్రీనివాస్, ధర్మగోని రాజా గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్ట లు వలిపిశెట్టి లక్ష్మీరాజ్యం, దోమకొండ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, షేర్, జొన్నల నర్సింలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.






