19 April, 2026 | 2:01 AM

ఉద్యమకారుల హామీలన్నీ నెరవేర్చండి

19-04-2026 12:38 AM
  1. వారిని నిర్బంధించే పరిస్థితి దురదృష్టకరం
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో వారికి గౌరవం దక్కలేదు
  3. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాం తి): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ లీడ ర్లు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. వారికి ఇస్తామన్న భూమి, పెన్షన్ సహా ఇతర హామీలను వెం టనే నెరవేర్చాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏండ్లు గడిచినా ఇంకా ఉద్యమకారులు తమ డిమాండ్ల సాధన కోసం చలో సెక్రటేరియట్‌కు వెళ్లడం, పోలీసులు వారిని అరెస్ట్ చేసి నిర్బం ధించే పరిస్థితి రావడం దురదృష్టమన్నారు.

రాష్ట్ర సాధనలో ముందున్న ఉద్యమకారులకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల పాలనలో సరైన గౌరవం దక్కలేదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న 600 మందికిపైగా తెలంగాణ ఉద్యమకా రులను కల్వకుంట్ల కవిత విడిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబసభ్యులు శనివారం చలో సెక్రటేరియట్‌కు బయల్దేరారు.

పోలీసులు వారిని అడ్డుకొని మెహదీపట్నం, నాం పల్లి, పంజాగుట్ట సహా వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకున్న కవిత శనివారం మధ్యాహ్నం హుటాహుటిన మెహదీప ట్నం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న ఉద్యమకారులకు సం ఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచే ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులతో ఫోన్‌లో మాట్లాడారు. అరెస్ట్ చేసి న వారందరినీ విడిచిపెట్టే వరకు తాను పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు.

పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి అరెస్ట్ చేసిన ఉద్యమ కారులందరినీ విడిపించారు. మెహదీపట్నం పోలీస్‌స్టేషన్ నుంచి ఉద్యమకారులను వెంటబెట్టు కుని బయటకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల తోపాటు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.

కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ఉద్యమకారుల కోసం బిల్లు పెడతామని చెప్పి మోసం చేశారని ఆగ్ర హం వ్య క్తంచేశారు. కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న ఉద్యమకారులకు వారి హక్కులను సాధించుకోవటం పెద్ద కష్టం కాదన్నారు. ప్రభు త్వం వెంటనే ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే భూ పోరాటాలు చేసి భూమి ఆక్రమించుకుంటామని హె చ్చరించారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యం లో భూ పోరాటాలు ప్రారంభించామని, మున్ముందు ఉద్యమకారులతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు.