ట్రేడ్ డీల్ చట్టాలను వెనక్కి తీసుకోవాలి
- దేశానికి దశ దిశా నిర్దేశం చేసిన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాలన
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్
ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో మహాధర్నా
ముషీరాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): దేశానికి మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి దశ, దిశ, నిర్దేశం, దూర దృష్టితో పాలన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తద్వారా పరిశ్రమలతో పాటు వ్యవసాయం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం ‘దేశ ప్రయోజనాలను అమెరికా తాకట్టు పెడుతూ రైతులకు మేలు చేసే ఇండో-యూఎస్ ట్రేడ్ డీల్ రద్దు‘ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ ప్రజల ఆవేదన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ మహాధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర వివిధ శాఖల కార్పొరేషన్ల చైర్మన్లు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను ఛిబ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ జగ్గారెడ్డి,
వివిధ జిల్లాల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దీర్ఘ కాలిక ఆలోచనతో భారతదేశం మొత్తం వ్యవసాయంపై ఆధారపడిన దేశం కాబట్టి వ్యవసాయానికి ఎక్కడ కూడా నష్టం లేకుండానే పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు.
గుండు సూది కూడా తయారు కానటువంటి ఈ దేశంలో నేడు రాకెట్లు తయారు అవుతుంటే ఈ గొప్పతనం నెహ్రూ, ఇందిరా గాంధీలదే అన్నారు. ఈ మహాధర్నాలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.






