22 July, 2026 | 3:59 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

పేదలపై కాంగ్రెస్‌ది నిర్లక్ష్య వైఖరి

21-09-2024 12:45 AM

బీజేపీ ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తొలి నుంచే రాహు ల్ గాంధీ కుటుంబం పేదల పట్ల నిర్లక్ష్య వైఖరే అవలంబిస్తుందని బీజేపీ ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగి స్తామంటూ అమె రికా వేదికగా రాహుల్ గాంధీ వ్యా ఖ్యానించారని   ఆగ్రహం వ్యక్తం చేశా రు. పార్టీ ఆఫీస్‌లో ప్రధాన కార్యదర్శి బంగా రు శ్రుతి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు కొండేటి శ్రీధర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లా డారు. విదేశీ గడ్డపై భారత రాజ్యాం గాన్ని  రాహుల్ గాంధీ అపహాస్యం చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ నైజాన్ని అమెరికా గడ్డపై నుంచి రాహుల్ ప్రపంచానికి చెప్పారని తెలిపారు. పేదల హక్కుల గురించి ఏనాడు కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు.