calender_icon.png 28 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

28-11-2025 12:44:19 AM

బీజేపీ జిల్లా కార్యదర్శి హంసరాణి కృష్ణ గౌడ్

మేడ్చల్ అర్బన్, నవంబర్ 27 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణగౌడ్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని గాలిలో వదిలేశారని అన్నారు.

గతంలో ఉన్న రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా 19 శాతానికి తగ్గించడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తమదని చెప్పారని ప్రస్తుతం ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు.

అరులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అందలేదని, గ్యాస్ సబ్సిడీ, ధాన్యానికి బోనస్ రావడం లేదని, రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుబంధు అందడం లేదని ఆమె పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.