calender_icon.png 13 September, 2024 | 12:25 AM

వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్

08-08-2024 03:39:14 PM

న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై గురువారం లోక్ సభలో చర్చ జరుగుతోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు తెలపగా, కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం, ఎస్పీ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాజ్యంగా విరుద్ధంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఖండించింది.  ఈ బిల్లు దారుణం, రాజ్యంగ స్ఫూర్తిపై దాడి చేసే విధంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.