25 February, 2026 | 3:18 AM

‘ఆత్మ’వారి సౌజన్యంతో అవగాహన సదస్సు

25-02-2026 01:44 AM

వెల్దుర్తి, ఫిబ్రవరి 24: వెల్దుర్తి మండలం రైతు వేదికలో ఆత్మ వారి సౌజన్యంతో (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) సహచర అభ్యాసం శిక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ శాఖ ఆ ధ్వర్యంలో ఎఫ్ పీ ఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతులకు నానో ఫర్టిలైజర్స్, నేచురల్ ఫామింగ్, బయోచార్, వరిలో వివిధ రకాల వంగడాల సాగులో మెలకువలు, సుస్థిర వ్యవసాయం సంబంధిత విషయాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అయినటు వంటి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఎస్.కె గుప్తా రైతులకి సలహాలు సూచనలను శిక్షణ రూపంలో అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ ,వ్యవసాయ విస్తరణ అధికారులు మజీద్ అలీ, ఉత్తంకుమార్ చంద్రవేణి , సాయికిరణ్, సింధు తో పాటు ఎఫ్ పీ ఓ బాడీ డైరెక్టర్లు, మెంబర్లు ఆత్మ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులకు శిక్షణ, సలహాలు సూచించి శిక్షణ పొందిన రైతులకి ఆత్మ వారి ఆధ్వర్యంలో శిక్షణ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.