20 April, 2026 | 4:03 AM

కాంగ్రెస్ వంచన

20-04-2026 02:16 AM
  1. మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
  2. దేశాన్ని విభజించడమే వారి లక్ష్యం
  3. రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి
  4. ఎంపీ తేజస్వి పక్షాన క్షమాణలు కోరుతున్నా
  5. కేంద్రమంత్రి శోభా కరంద్లాజే

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): భారత మహిళల చరిత్రలో ఏప్రి ల్ 17 ఒక చీకటి రోజుగా మిగిలిపోయిందని, రాహుల్‌గాంధీ నాయకత్వం లోని ఇండియా కూటమి దేశంలోని మహిళలతోపాటు మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఘోరంగా మోసం చేసిందని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే మండిపడ్డారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలను రేవంత్‌రెడ్డి దోచుకుంటు న్నారని, ఇలా చేస్తున్న ఆయనపై ఏ కేసు పెట్టాలని ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణతో కలిసి ఆమె మాట్లాడారు. లోక్‌సభలో రాహుల్‌గాంధీ తీరు సరిగా లేదని విమర్శించారు. మహిళలు చిరకాలంగా కోరుకుంటున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లుతోపాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనా లను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చిందని గుర్తు చేశారు.

జనాభా నియంత్ర ణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో జనగణన తర్వాత ఎలాంటి అన్యాయం జరగకుండా రక్షణ కల్పించడమే ప్రధాని మోదీ ఉద్దేశమని స్పష్టంచేశారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లులు విఫలమైనప్పుడు కాంగ్రెస్, ఇండీ కూటమి నాయ కులు దేశ ప్రయోజనాలను మరిచి,

ఆ వైఫల్యాన్ని పండుగలా జరుపుకున్నారని, వారి నవ్వులు, హ గ్గులు దేశాన్ని ఉత్తర -దక్షిణంగా విభజించే కుట్రకు నిదర్శనమని మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని తెలంగాణ ప్రజలను కోరారు.

గంట సమయం ఇస్తే కొత్త బిల్లు..

దక్షిణ భారతానికి న్యాయం చేసే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని, కేవలం ఒక గంట సమయం ఇస్తే కొత్త బిల్లును తీసుకువస్తామని ప్రతిపాదించినప్పటికీ ఇండీ కూటమి పార్టీలు దానిని తిరస్కరించాయని శోభా కరంద్లాజే ఆవేదన వ్యక్తంచేశారు. కేవ లం తమ రాజకీయ లాభాల కోసం, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలను మరింత పెం చేలా వారు వ్యవహరించారని విమర్శించా రు.

జనాబా లెక్కలతోపాటు కులగణన చేస్తున్నామని, ఈ లెక్కలన్నీ 2031 వరకు సమ గ్రంగా వస్తాయని చెప్పారు. 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు, దక్షిణ భారతదేశంలో లోక్‌సభ సీట్లు పెంచాలనే ఉద్దేశం తో మోదీ ఈ బిల్లును తీసుకొచ్చారని తెలిపారు. నేటి మహిళలు రక్షణ రంగంలో ఫైట ర్ జెట్లు నడుపుతూ దేశానికి సేవ చేస్తున్నారని, అయినప్పటికీ రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు రాకుండా కాంగ్రెస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో ముద్ర లోన్లలో 63- శాతం మహిళలకే దక్కాయన్నారు.

కాంగ్రెస్‌లో ఒకే కుటుంబ మహిళలకు అవకాశం..

కాంగ్రెస్‌లో మహిళలకు అవకాశం అంటే అది కేవలం ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీ వంటి ఒకే కుటుంబానికి పరిమితమని.. దీనికి భిన్నంగా బీజేపీ సామాన్య కుటుంబాల మహిళలకు ప్రతిభ ఆధారంగా ప్రాధాన్యం ఇస్తున్నదని కేంద్రమంత్రి శోభ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలలో సీట్లు పెంచే ప్రతిపాదనను అడ్డుకో వ డం ద్వారా ఇండీ కూటమి దక్షిణ భారతాన్ని మోసం చేసిందన్నారు.

ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుం చి 26కు, ఏపీలో 25 నుంచి 38కి పెరుగుతాయని, ఈ ప్రయోజనాన్ని ఇండీ కూటమి అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆ పార్టీలో కేవలం వారసత్వ రాజకీయాలే నడుస్తాయని, రా హుల్ గాంధీ పార్లమెంట్‌లో తనను తాను మాంత్రికుడిని అని సంబోధించుకుంటూ అపరిపక్వంగా ప్రవర్తించారని విమర్శించారు. మహిళలను వంచించిన కా ంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీలు దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి?

తెలంగాణలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై, ప్రజలకు చేసిన అన్యాయం పట్ల రేవం త్ సర్కారుపై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మహి ళలకు రూ.2,500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా కాం గ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు.

ఉచిత బస్సు తర్వాత కర్ణాటకలో బస్సులు తక్కువయ్యాయని, తెలంగాణలోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం హైకమాండ్‌ను సంతోషపెట్టడానికే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి, మీడియా ప్యానలిస్ట్ డాక్టర్ ప్రభాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.