15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

కాంగ్రెస్‌వి విభజన రాజకీయాలు

24-06-2025 12:56 AM
  1. హిందువుల పట్ల నిర్లక్ష్యం.. ఇతర మతాలకు బుజ్జగింపు
  2. శ్యామాప్రసాద్ ముఖర్జీ బలి దివస్ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులం, మ తం, భాషల పేరుతో దేశాన్ని విభజించే ప్ర యత్నం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. హిందువుల పట్ల నిర్లక్ష్యం చేసి, ఇతర మతస్తులను బు జ్జగించేలా ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడిందన్నారు.

మోదీ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసి.. పార్టీ కంటే దేశ సమగ్రత ముఖ్యం అన్న భావనతో పాలన అ ందించిందని తెలిపారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలి దివస్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తమకు పార్టీ ఒక్కటే దేశ సమగ్రతే ముఖ్యమని పునరుద్ఘాటించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్పుడు బీజేపీ ఎల్లప్పుడూ ముందుండి పనిచేసిందన్నారు.

ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థి తి ద్వారా పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, తన పదవిని నిలుపుకోవ డానికి న్యాయస్థానాల తీర్పులను కాలరాశారని.. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి, లక్షలాది మందిని జైలులో వేశారని పేర్కొన్నారు. ఆనాడు జనసంఫ్‌ును దేశం కోసం, పౌర హక్కుల కోసం, పత్రికా హక్కులను రక్షించేలా.. ప్రజాస్వామ్యం కోసం జనతా పార్టీలో తృణప్రాయంగా విలీనం చేసిందన్నారు.

కశ్మీర్ విషయంలోనూ నెహ్రూ తాత్కాలిక ప్రయోజనాల కోసం దేశ భవిష్యతును తాకట్టు పెట్టారని... పాకిస్థాన్‌కు కశ్మీర్‌లోని కొంతభాగాన్ని అప్పగించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తొలికేంద్ర మంత్రివర్గంలో మంత్రి గా పనిచేసిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఫ్‌ును స్థాపించారని..

ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ కశ్మీర్ పరిరక్షణ కో సం ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని, జమ్మూకశ్మీర్‌ను దేశంలో అంతర్భాగం చేయాలని శ్యా మాప్రసాద్ మొదట ఉద్యమాన్ని చేపట్టారన్నా రు. శ్యామా ప్రసాద్ జమ్మూకశ్మీర్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని పేర్కొ న్నారు. దేశ సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం చేశారని తెలిపారు.