15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఎల్లారెడ్డి అభివృద్ధికి బాటలు వేస్తున్న

24-06-2025 12:55 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, జూన్ 23,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి అభివృద్ధికి బాటలు వేస్తున్న నియోజకవర్గ, పట్టణ ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. సోమవారం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో 80 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపనలు చేశారు.

ఎమ్మెల్యే కు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎల్లారెడ్డిమండలం, లోని గ్రామాలలో, ఎమ్మెల్యే మదన్ మోహన్  ఆధ్వర్యంలో వెల్లుట్ల గ్రామం నుండి వెల్లుట్ల తండా BT రోడ్ 1.70 కోట్ల నిధులతో, వెంకటాపూర్ గ్రామ BT రోడ్, 2.0 కోట్ల నిధులతో సోమర్యాగడి తండా BT రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, వెల్లుట్ల, వెల్లుట్ల తండా, వెంకటాపూర్, సోమార్యఘడ్ తండా గ్రామ ప్రజల చిరకాల కోరిక అయినా రోడ్ నిర్మాణం పనులు ప్రారంభించడం చాల సంతోషంగా ఉందని అన్నారు.  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడుంబా సాయిబాబా, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజార్ కాద్రి, తదితరులు పాల్గొన్నారు.