calender_icon.png 17 October, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ డీఎన్‌ఏ కరప్షన్!

17-10-2025 12:57:02 AM

  1. బెదిరింపులు, సెటిల్‌మెంట్లు, వసూళ్లు  ఇదే ప్రజాపాలన తీరు
  2. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బట్టబయలు
  3. మంత్రి కుమార్తె సుస్మిత ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలి
  4. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దోచుకునే పార్టీలను తిరస్కరించాలి
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు  

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : “కాంగ్రెస్ అంటేనే కరప్షన్  అది ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న న్ని రోజులు అవినీతి కొనసాగిందని ఇప్పు డు రాష్ట్రంలోనూ అదే దుస్థితి దాపురించిందని విమర్శించారు. బెదిరింపులు, సెటిల్ మెంట్లు, వసూళ్లు ప్రస్తుతం ఇదే ప్రజాపాలన తీరని ధ్వజమెత్తారు.

గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి వోకల్ ఫర్ లోకల్ బ్యానర్‌ను రాంచందర్‌రావు ఆవిష్కరించి మాట్లాడారు. సెటిల్‌మెంట్లు, అవినీతి ఘటనల్లో ఆ పార్టీ మంత్రులు, సీఎం అనుచరులు ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు.  ఈ విషయం మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బయటపడిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు వారి ఆస్తులు, బినామీలు, అక్రమాల గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ దోచుకునే ప్రభుత్వంగా మారిందని, గతంలో బీఆర్‌ఎస్‌దీ ఇదే రీతిన  దోచుకుందన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దోచుకునే లీడర్లను, తుపాకీ పట్టుకుని బెదిరించే కాంగ్రెస్ నేతలను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ వివాదంలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన ఆరో పణలతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారాలు బ యటపడ్డాయని, దీనిపై పూర్తి విచారణ జరగాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. 

‘వోకల్ ఫర్ లోకల్’కు భారీ స్పందన

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపునకు భారీ స్పందన వస్తోందని రాంచందర్‌రావు తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుందని పేర్కొన్నారు, దేశ వ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తోందని తెలిపారు. ఈ ఉద్య మం ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు మద్దతు అందించిందన్నారు. స్థానికంగా త యారైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనను ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని అన్నారు