calender_icon.png 18 October, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులపై కేసులు పెడతా

17-10-2025 12:57:26 AM

శామీర్ పేట్ , అక్టోబర్ 16: రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన జీవోలను లెక్కచేయకుండా అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై చట్టపరంగా కేసులు వేయడం జరుగుతుందని మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

గురువారం శామీర్ పేట్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులు అధికార దుర్వినియోగం చేశారని వీరిపై చట్టపరంగా కేసులు వేయడం జరుగుతుందని ఆయన మండిపడ్డారు .

ప్రభుత్వ ప్రొసిడింగ్ ను ఉన్న కూడా దాన్ని తుంగలో తొక్కి అధికారులు ఇలా చేయడం ఎంతవరకు సమన్యజమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తునికి రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.