16 April, 2026 | 10:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాంగ్రెస్ రాజ్యాంగం పాటించదు

28-06-2025 01:07 AM

విదేశాంగశాఖ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ, జూన్ 27: భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలు పాటించరని విదేశాంగ శాఖ మం త్రి జైశంకర్ శుక్రవా రం పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏండ్లు పూర్తయి న సందర్భంగా భారతీయ జన తా యువ మోర్చా (బీజేవైఎం) ఆ ధ్వర్యంలో ఢిల్లీలో మాట్లాడారు. కాం గ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ‘ఎమర్జెన్సీ వల్ల అనేక మంది జైళ్లల్లో మగ్గాల్సి వచ్చింది. కాంగ్రెస్ హ యాంలో అవినీతి పెరిగిపోయి..

ద్ర వ్యోల్బణం ఎక్కువవడం వల్ల ప్రభుత్వానికి ప్రజాదరణ కరువైంది. అందుకే ఎమర్జెన్సీ విధించారు. దేశ పౌరులు, పత్రికల ప్రాథమిక హ క్కులను ప్రభుత్వం నిలిపివేసింది. కొంద రు రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజల్లో తిరుగుతారే తప్పా.. రాజ్యాంగాన్ని పా టించరు. చేసిన తప్పుల గురించి కాంగ్రెస్ ఎన్నడూ విచారం వ్యక్తం చేయదు.21 నెలల ఎమర్జెన్సీ కాలం లో ఎవరి ఆమోదం లేకుండా నే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.’ అని పేర్కొన్నారు.