26 April, 2026 | 3:23 AM

అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం

26-04-2026 01:45 AM

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి  

సూర్యాపేట, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శనివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, దివ్యాంగులకు త్రీ వీలర్, అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం జగదీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం నేరవేర్చడం లేదన్నారు. లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందన్నారు.

తులం బంగారం ఇంకెప్పుడిస్తారని నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారం టే ఆది కాంగ్రెస్ పాపమేనన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. వడ్లు, మక్కల కొనుగోలు విషయంలోనూ జాప్యం సరికాదన్నారు. మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు మొదలైతుందని అకాల వర్షాలు పడకముందే కొనుగోలు సజావుగా పూర్తిచేయాలన్నారు. మంచినీళ్ల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా మేలుకొని ఇచ్చిన హామీలఅమలుపై, అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదన్నా రు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.