18 August, 2026 | 8:00 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

పొనుగోడు గ్రామస్తుల ఔదార్యం

26-04-2026 01:43 AM

చిన్నారుల పేరిట రూ.4 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్

అభినందించిన పలువురు

గరిడేపల్లి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన యూసుఫ్ ఇటీవల మృతి చెందాడు.కాగా అతనికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆయనది పేద కుటుంబం కావడంతో ఆ పిల్లలను దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు, యువత అంతా ఒకటై వారి భవిష్యత్తుకు బాసటగా నిలిచారు.

గ్రామంలోని చెరువు కట్ట బజార్ సభ్యులు, పదవ తరగతి పూర్వ విద్యార్థులు, ఎంఐఎం టీమ్, మసీదు ఇ మహమ్మదీయ కమిటీ, షేక్ నజీర్ ఫ్రెండ్స్, గిరి ప్రసాద్ బ్యాచ్ అందరూ కలిసిరూ. రూ.4,05,081 నగదును సేకరించి ఆ మొత్తాన్ని చిన్నారుల పేరిట పోస్టాఫీస్‌లో పిక్స్ డ్ డిపాజిట్ చేశారు. పిల్లల చదువులకు, ఎదుగుదలకు బాటలు వేశారు. ఆపదలో ఉన్న ఊరి బిడ్డల కోసం పొనుగోడు చూపిన చొరవ అందరికీ స్ఫూర్తి దాయకమనీ పలువురు అభినందించారు.