2028లో కూటమిదే అధికారం
తెలంగాణ రాజకీయ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఇప్పటి నుంచే కష్టపడి పని చేస్తే 2028 అధికారం మనదేనని కూటమి అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, సెక్రటరీ జనరల్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కన్వీనర్లు డాక్టర్ ఈడా శేషగిరిరావు, రామావత్ లాలు నాయక్ డేవిడ్ ఆంధ్‌ర్యూ పిలుపు ఇచ్చారు.
మంగళవారం రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాజకీయ శిక్షనా తరగతుల్లో వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అవినీతి బంధు ప్రీతీ కు టుంబ రాజకీయాలకే పరిమితమై ప్రజలను మోసం చేస్తున్నా యని తమ పది గ్యారంటీలతో తెలంగాణ పేద ప్రజల బతుకులు మారుతాయని కూటమి నేతలు హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా కూటమి జాతీయ అధికార ప్రతినిధి హై కోర్టు అడ్వకేట్ ఎస్ శరత్ కుమార్ అవినీతి రహిత తెలంగాణ సాధన అంశం పై మాట్లాడుతూ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పది రేట్లు దుర్మార్గుడు, దోపిడిదారుడని ఇలాంటి తెలంగాణ ద్రోహుల నుంచి తెలంగాణ సమాజాన్ని కాపాడానికి తాను నిజాయితీ పరులు విద్యావంతులైన తెలంగాణ రాజకీయ కూటమి నేతలను బలపరుస్తున్నానని ప్రజ లు కూడా మద్దతు ఇచ్చి అధికారం ఇవ్వాలని కోరారు.
ఈ శిక్షణలో వక్తగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విట్టల్ మాట్లాడు తూ నాయకుడంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి.. ప్రజలను ప్రేమించాఅ న్నారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి తెలంగాణ దోపిడీదారులని, అవినీతి తిమింగిలాలని వారి నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలంటే తెలంగాణ రాజకీయ కూటమి లాంటి ప్రత్యామ్నా యం కావలని సంకల్పం ఉంటే సాధ్యం కానిది రాజకీయాల్లో లేదని ఎమ్మెల్యేలు కావడం కష్టమేమి కాదన్నారు. కాన్షీరాం, కేజ్రీవాల్ నిరూపించారని, సామాజిక తెలంగాణ సాధన కోసం మీతో కలిసి ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడత శిక్షణలో 70 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.






