15 April, 2026 | 9:52 AM

నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంహెచ్డీ నిరసన

23-02-2026 09:57 PM

- నాగర్ కర్నూల్ ఘటన పై చర్యలు తీసుకోవాలని 

- చిన్నారి మృతికి నష్ట పరిహారం చెల్లించాలని

బెల్లంపల్లి,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ ఘటనపై బెల్లంపల్లిలో మాది హక్కుల దండోరా ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మరలో మండలంలో కుల వివక్ష ప్రదర్శిస్తూ, రెండు నెలల చిన్నారి పాప మృతికి కారణమైన దుర్మార్గులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి ఎం హెచ్ డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్ చేశారు.

బెల్లంపల్లి అంబెడ్కర్ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా( MHD) మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అకునూరి రాజ్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి గోగర్ల శేఖర్  ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి  చేసిన నిరసన ప్రదర్శనలలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కోమ్మేర మండల కేంద్రంలో మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన BC కమ్యూనిటీ రజక (చాకలి) కుటుంబo ఒక SC మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళపై రెడ్డి అగ్రకుల దురహంకారంతో దైవ దర్శనానికి వెళ్లిన వారిపైన కులం తక్కువ అని తీవ్రతి తీవ్రంగా దాడి చేశారని విమర్శించారు.

ఈ దాడీలో పసి పాప మృతి చెందిందని తెలిపారు. పసిపాప అని కూడా చూడ కుండా కాళ్ళతో తన్ని చంపిన ఈ అమానుష ఘటనకు కారకులైన రెడ్డి దురంకారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మన సమాజాన్ని కలచివేసిందనీ వాపోయారు. ఒక SC మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ, బీసీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుల ఆధారిత వివక్ష ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ఆ వివక్ష కారణంగా రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైనదని  ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని అవమానపర ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తుకారాం రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి లను వెంటనే అరెస్టు చేసి, SC ST అట్రాసిటీ కేసు తో పాటు .సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని,  డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలన్నారు. 

మొన్న సూర్యాపేట నేడు నాగర-కర్నూల్ లో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. కుల ఆధారిత హింసకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదని ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇవ్వాలని అన్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు  గంగారపు కోళ్ల రమేష్, ఆకునూరి రాజకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగర్ల శేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ఇడిగిరాల ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఆరేపెళ్లి రమేష్, పట్టణ గౌరవ అధ్యక్షుడు గద్దల కుమార్, పట్టణ యూవజన నాయకులు పల్లె రమేష్, పట్టణ సీనియర్ నాయకులు నాథరి భీమయ్య, పట్టణ సీనియర్ నాయకులు కాంపెళ్లి సతీష్ పట్టణ సీనియర్ నాయకులు ఎరుకల సంఘం నాయకులు ఉండాడి మల్లయ్య, జిల్లాలపల్లె రమేష్ పట్టణ సీనియర్ నాయకులు ఆరేపెళ్లి నరేష్ కుమార్ పాల్గొన్నారు.