calender_icon.png 18 November, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

18-11-2025 12:00:00 AM

పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ 

రేగోడు, నవంబర్ 17: నిరుపేదల సొంతింటి కలలను నెరవేర్చిన ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానిదని పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ అన్నారు, సోమవారం మం డలంలోని గజవాడ గ్రామం లో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు పంచాయతీ పరిధిలోని తండాలో ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని పూర్తి చేసుకున్న వారి ఇల్లుకు కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని ని రుపేదలందరూ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో సీతారావమ్మ, కార్యదర్శి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.