calender_icon.png 18 November, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ అరేబియా బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం

18-11-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాం తి): సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం అన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు అండ గా ఉంటామన్నారు మదీనా హైవేపై జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదం అని అన్నారు.

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లిలోని హజ్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీల సంక్షేమ మంత్రి మొహమ్మద్ అజార్ ఉద్దీన్, TMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషి, లో తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుత  క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మలకు మా హృదయపూర్వక ప్రార్థనలు వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోం దన్నారు. ప్రత్యేక హెల్ప్ లైన్  ఏర్పాటు చేసింది. సహాయం కోసం, కుటుంబాలు NRI హెల్ప్లైన్: 7997959754ను సంప్రదించవచ్చున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు