18-11-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ
నిజామాబాద్ లీగల్ క రెస్పాండెంట్ నవంబర్ 17: (విజయ క్రాంతి) : కోర్టులలో జరిగే నేర న్యాయ విచారణలలో ముద్దాయిల తరపున డిఫెన్స్ న్యాయవాదులుగా పాల్గొనే ముందు కేసులకు సంబందించిన సమగ్ర అధ్యయనం చాలా అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి సి. హెచ్ పంచాక్షరీ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ మహమ్మద్ షాదుల్ల,విశ్వక్ సేన్ రాజ్, బాలాజీ, రవిబాబు, రజిత, మహిపాల్, మహమ్మద్ ఖాళీద్ లు హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమి కార్యాలయంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో న్యాయ నిపుణులు అమూల్యమైన న్యాయ విషయ పరిజ్ఞానం తమ భవిష్యత్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ప్రస్థానాన్ని, న్యాయవాద వృత్తి జీవనానికి అతిముఖ్యమైనవని వారు ఫోన్ ద్వారా విజయ క్రాంతి కి తెలిపారు.
సంస్థ సభ్య కార్యదర్శి పంచాంక్షరీ నేర విచారణ పూర్తి అయిన తరువాత పోలీసు అధికారులు కోర్టులకు సమర్పించే చార్జీషీట్ ను, దానికి అను బందంగా అందజేసే డాక్యుమెంట్స్ ను క్షుణంగా చదవాలని అన్నారు. నేరం జరిగిన తీరును ప్రాసిక్యూషన్ చీఫ్ ఇజ్ఞామినేషన్ తరువాత ముద్దాయిల తరపున ఏయే విషయాలు క్రాస్ ఇజ్గామినేషనల్ చేయాలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యూడిషియల్ ) జె. జీవన్ కుమార్ ప్రెసెటేషన్ అఫ్ ఎవిడెన్స్ ను ఎలా కోర్టులలో ప్రెజెంట్ చేయాలనే విషయాలు తెలియజేశారు.
లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కు అనువైన సాక్ష్యాలు ఏమేరకు ఉన్నాయో తెలుసుకొని డిఫెన్స్ చేసుకోవాలని అన్నారు. పోలీసులు కోర్టుకు అందజేసిన డాక్యుమెంట్స్, సాక్ష్యులు కోర్టులో చెప్పిన వాంగ్మూలలలో తేడాలు లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఊయోగకరమని ఆయన తెలిపారు.నేర విచారణలో న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమి డైరెక్టర్ వి. బాల భాస్కర్ రావు వివరించారు.
సుప్రీంకోర్టు, రాష్ట్రల హైకోర్థుల తీర్పులు, చట్టాలను నిరంతరం చదవడమే పనిగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. చట్టాలపై,తీర్పులపై పట్టు ఉంటేనే న్యాయవాద వృత్తి అయిన, లీగల్ ఎయిడ్ సిస్టమ్ లో అయిన ఉపయోగకరమని ఆయన అన్నారు.
హైకోర్టు న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పాలకుర్తి కిరణ్ నేర న్యాయ విచారణలో ఎవిడెన్స్ విలువ చాలా చాలా విలువైనదని అన్నారు. ఎవిడెన్స్ తోనే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు శిక్షలకు గురికావడమా, కాకపోవడమా అనేది నిర్ణయించబడుతుందని ఆయన వివరించారు. ముద్దాయిల నేర అంగీకార వాంగ్మూలాలు, డి ఎన్ ఎ రిపోర్టులు, మరణ వాంగ్మూలాలలో ఉన్న తేడాలు తెలుసుకోవాలని అన్నారు.