calender_icon.png 28 July, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

27-07-2025 10:15:56 PM

ఎమ్మెల్సీ కవిత..

హనుమకొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని భూభారతి పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని ప్రైవేట్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రైతుబంధు రైతుల ఖాతాలో జమ కావటం లేదని తుతుమంత్రంగా రైతుబంధు అమలు చేస్తుందని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ట్రైసిటీకి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వరంగల్లులో టెక్స్ టైల్ పార్కు మంజూరు చేసింది కేసీఆర్ అని  గుర్తు చేశారు. ప్రజలు ఆనందంగా లేరని బిసి కులాలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని విమర్శించారు. కులగణ జనలలో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులలో అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదని, సకాలంలో పెన్షన్లు మంజూరు కావడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్, జాగృతి కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురం లో పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.