calender_icon.png 28 July, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించండి.!

27-07-2025 10:18:31 PM

వైరా రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న కారు..

కాన్వాయ్ లో క్యాంపు కార్యాలయానికి వస్తు ఘటనను చూసి ఆగిన మంత్రి పొంగులేటి..

వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని ట్రాఫిక్ సీఐకు ఆదేశాలు..

ఖమ్మం (విజయక్రాంతి): ఆపదలోనూ నేనున్నా అని మరోమారు చాటుకున్నారు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇదే సమయంలో కొత్తగూడెం నియోజవకర్గ పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న మంత్రి పొంగులేటి ఆ ఘటనను చూసి కాన్వాయ్ ను ఆపారు. అధైర్యపడొద్దని నేనున్నానని ప్రమాదంలో గాయపడిన యువకులకు భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ సాంబశివరావును దగ్గరకు పిలిచి క్షతగాత్రులను త్వరగా కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు.