calender_icon.png 19 December, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం

19-12-2025 05:25:16 PM

- బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్

ముకరంపుర,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల మొండి వైఖరి వీడానాడి ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు అమలు చేసి చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని బీసీ కార్యాలయంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు మదాసు సంజీవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యతిదిగా హాజరైన ఎన్నం ప్రకాష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు  42% రిజర్వేషన్లు అమలు చేస్తారని ఆశిస్తే ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అనడం సిగ్గు చేటని అన్నారు.

గతంలోనే అసెంబ్లీలో అన్ని పార్టీలు బీసీ బిల్లు కోసం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా ఆమోదించాయని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసాకే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్భాలు పల్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, మంద వెంకన్న, జిల్లా కార్యదర్శి దుంపట మురళీ, ప్రచార కార్యదర్శులు గుడిసెల రమేష్ గౌడ్, వంగల రవి గోపాల్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ దీపక్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కుసుంబ ఆదర్శ, సాయితేజ, శివ, తదితరులు పాల్గొన్నారు.