19-12-2025 05:21:48 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీల ఎన్నికల్లో జగన్నాధపురం సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కుంజా వినోద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్నాధపురం సర్పంచిగా ఎన్నికైన కుంజా వినోద్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు అడపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.