calender_icon.png 19 December, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించిన ఎంపీడీవో

19-12-2025 05:28:37 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన కుటుంబాలు తప్పకుండా  పనులు ప్రారంభించాలని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ మంజూరైన కుటుంబాలు కంపల్సరిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. తాండూరు గ్రామంలో సుమారు 26 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు దాదాపు అందరూ పనులు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శిలు తిరుపతి కిష్టయ్య ఉన్నారు.