24 April, 2026 | 1:09 PM

Breaking News

ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •   వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే   •   ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •  

గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో తట్టెడూ మట్టి తియ్యని మంత్రి

06-02-2025 11:27 PM

రిబ్బన్ కటింగ్‌లకే పరిమితం అవుతున్న మంత్రి..

భీమదేవరపల్లి (విజయక్రాంతి): గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం 437 కోట్లు మంజూరీ ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటున్నప్పటికి నేటి వరకు ప్రాజెక్ట్ నిర్మాణంలో తట్టెడూ మట్టిని సైతం తీయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ దుయ్యబట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మంత్రి పొట్లపల్లి ఆలయంలో ప్రమాణం చేసినారని, ఇక హుస్నాబాద్‌కు మంత్రి పదవి వచ్చిందని అభివృద్ధి చేస్తారూ అనుకున్నామని కాని నేడు కాంగ్రెస్ నేతలే తనతో మంత్రి వద్ద ఏం పని కావడం లేదని వాపోతున్నట్లు తెలిపారు.

మంత్రి కేవలం నాలుగు రిబ్బన్ కటింగ్‌లు, పలువురిని గుద్దడం వరకే పరిమితం అవుతూ హైద్రాబాద్ వరకే పరిమితం అయ్యారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు లక్ష రూపాయల ఇన్స్య్‌రెన్స్ పధకం వర్తింపజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కేవలం ఒక్క బస్సు పధకం మాత్రమే అమలు అయిందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఆదరించాలన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ సుధీర్‌కుమార్, వంగ రవిందర్, మండల సురేందర్, జక్కుల అనితరమేశ్, సయ్యద్ షరీఫోద్దిన్, సంగ సంపత్, సల్పాల తిరుపతి, అప్పని పద్మబిక్షపతి, గూడెల్లి రాజిరెడ్డి, సయ్యద్ నవాబ్‌పాషా, కండె సుధాకర్, మాడిశెట్టి కుమారస్వామి, శనిగరపు సదానందం, ఎర్రోజు వినయ్, మహబూబ్ అలీ, జక్కుల రాజు, గుడికందుల పూర్ణ, గుడికందుల రాజు, మాడ్గుల అశోక్, రజనాచారి, ఆలూరి రజిత తదితరులు పాల్గొన్నారు.