24 April, 2026 | 2:04 PM

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

24-04-2026 12:46 PM

హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ముత్తోజిపేటలో(Muthojipet) ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ కార్మికులు నర్సంపేట డిపోకు తీసుకెళ్తా మనడంతో ఆందోళన నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట తీసుకెళ్లి డిపో వద్ద నివాళులర్పిస్తామని కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని నర్సంపేట డిపోకు(Narsampeta Depot) తరలించేందుకు కార్మికులు, కుటుంబసభ్యులు యత్నించారు. శంకర్ గౌడ్(RTC Driver Shankar Goud) మృతదేహం నర్సంపేటకు తరలించకుండా పోలీసులు అడ్డుకున్నారు.

నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని కార్మికులు పోలీసులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు, కుటుంబసభ్యులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పెద్ది సుదర్శన్ రెడ్డి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నర్సంపేట పీఎస్ కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులు పోలీసుల వామనాలను అడ్డుకున్నారు.