24 April, 2026 | 12:57 PM

Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే   •   ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •  

కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

24-04-2026 11:55 AM

కోనరావుపేట,(విజయక్రాంతి):కోనరావుపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్‌లో 2వ వార్షికోత్సవాన్ని గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మదన్‌లాల్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుని, విద్యార్థుల సందడితో కళకళలాడింది.

రంగురంగుల వేషధారణలో చిన్నారులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ మస్కూరి కాశీరాం  ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు,వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు విద్య ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని సూచించారు.పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.ఈ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు, పాటలు వంటి పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

చిన్నారుల ప్రతిభ, ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంది.ముఖ్యంగా బాలబాలికలు చేసిన నృత్య ప్రదర్శనలు సభలో హాజరైన వారిని ఉత్సాహపరిచాయి.పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన ప్రశంసాపత్రాలు అందజేసి ప్రోత్సహించారు. తమ పిల్లల ప్రదర్శనలు చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం ఘనంగా ముగిసింది.