24 April, 2026 | 2:39 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •  

వారబంధితో రైతుల గోస

07-02-2025 12:00 AM

తుంగతుర్తి,ఫిబ్రవరి 6: వారబంధీ పద్దతిలో ఎస్సారెస్పీ జలాలు ప్రధాన కాలువల ద్వారా వస్తున్నప్పటికీ చివరి వరుస పోలాలకు నీరు అందక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కాల్వలకు కొంతమంది రైతులు రాత్రి వేళల్లో ఎక్కడపడితే అక్కడ గండ్లు పెట్టడం, మరి కొంతమంది రైతులు  తమ తోటలకు ప్రత్యేక కాలువలు తీసి  ఇష్టానుసారంగ నీటిని వాడుతుండటంతో వాడుతున్నారు.

ఈ సీజన్లో వారాబంది ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు చెరువులు, కుంటలు, చివరి భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదు.  ఐబీ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా  చివరి పోలాలకు  నీరు చేరడం లేదు.  సాగునీరు అందకపోవడం పంట నష్ట పోతామని,  తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారులు  స్పందించి చివరి భూములకు కాలువ నీళ్ళు అందే విధంగా  చర్యలు తీసుకోవాలని  రైతులు కోరుతున్నారు.