ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఏప్రిల్24(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడి ఆత్మహత్య.. ఇది ప్రభుత్వ హత్య’ అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద సమ్మె జరిగితే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు
బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్(Congress Government) చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 28వ పేజీలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండు పీఆర్‌సీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి చదివి వినిపించారు. ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాడితే.. ఓటు కాంగ్రెస్‌కు వేశారని అన్నారు.






