కాంగ్రెస్ వచ్చింది. కరువు వచ్చింది
రంగుల సినిమా చూపించి అధికారంలోకి
కేసీఆర్ కాళేశ్వరంలాంటి అద్భుత దేవాలయం కట్టారు
పదేండ్ల నిజంతో 150 రోజుల అబద్ధానికి పోరాటం
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, మే 6(విజయక్రాంతి): కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని.. కరెంట్ లేక ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లతోపాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తంగళ్లపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో పదేళ్లు ఆత్మహత్యలు అన్న మాటే వినబడలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అబద్ధపు హామీలతో సినిమా చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
ఐదు నెలల్లోనే అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయని, అన్ని వర్గాలు కాంగ్రెస్‌పై కోపంగా ఉన్నాయని తెలిపారు. రుణమాఫీకి ఉసరవెళ్లి రంగులు మార్చినట్టు తేదీలు మార్చుతున్నారని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి పార్లమెంట్‌లో 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. 2014లో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చాయని, ఈ పదేళ్లలో చేసిన పనులు అడిగితే సాయంత్రం దాకా లెక్క చెప్తామని అన్నారు. మరి భాజపాకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పమని సంజయ్‌ని అడిగితే మేము గుడి కట్టినం అంటారు. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన మోదీకి మనం ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఎన్నో పనులు చేసిన కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు అవకాశమని చెప్పారు.
బీఆర్‌ఎస్ బీజేపీ మధ్యనే పోటీ
రంగారెడ్డి/రాజేంద్రనగర్/మహేశ్వరం, మే6(విజయక్రాంతి):పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ ఉన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాల అసలు గుట్టు పేదలకు అర్థమైందని, ఈ ఎన్నికల్లో కాంగ్రె స్‌కు తగిన గుణపాఠం చెప్తారన్నారు. సోమవారం రాత్రి చేవెళ్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా శేరిలింగంపల్లిలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో, రాజేంద్రనగర్ శంషాబాద్‌లో, మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌లో కార్నర్ మీటిం గ్ రోడ్‌షోను నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌లో బీజేపీ కుట్ర దాగి ఉందని, త్వరలోనే వారి కుట్రలన్నీ బహిర్గతమ వుతాయని చెప్పా రు. ఎంపీగా రంజిత్‌రెడ్డి ఏం చేశారని, పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే బీజేపీలో కలిసే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డినే అని పేర్కొన్నారు.




