కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి
l పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ
మంథని, ఏప్రిల్ 22 (విజయకాంత్రి) : పేదల కష్టాలు తీరాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, పెద్దపల్లి నుంచి తనను ఆశీర్వదిం చాలని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని హనుమాన్ ఆలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబుతో కలిసి సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రజలతో తమ కుటుం బానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. మా తాత వెంకటస్వామి(కాకా), తండ్రి వివేక్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో చేశారని చెప్పారు.
ఎంపీ ఎన్నికలతో మీ ముందుకు వస్తున్నానని.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు మాట్లాడుతూ.. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మం థని అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, ఎంపీపీ ఆరేళ్లి దేవక్కకొమురయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ తోట చంద్రయ్య, నాయకులు ముస్త్యాల శ్రీనివాస్, కనకయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






